విశాఖ ఏజెన్సీలో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి ఓ బాలుడు కొండ వాగులో కొట్టుకుపోయి మృతి చెందాడు. జి.మాడుగుల మండలం భీరం గ్రామం కొండవాగుని ఆనుకుని ఉంటుంది. కుండపోత వర్షం కురుస్తుండగా.. పక్కనే ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు కొట్టుకుపోయాడు. గ్రామస్థలు చూసినప్పటికీ పట్టుకునేలోపే అర కిలోమీటరు మేర కొట్టుకుపోయాడు. గ్రామస్థలు వెలికి తీయగా అప్పటికే బాలుడు మృతి చెందాడు. బాలుడు గ్రామ వాలంటీర్ సురేష్ కుమారుడు. బాలుడి మృతితో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
వాగులో కొట్టుకుపోయిన నాలుగేళ్ల బాలుడు మృతి - boy die in vishaka agency
ఏజెన్సీలో కురిసిన భారీ వర్షానికి నాలుగేళ్ల బాలుడు బలయ్యాడు. గ్రామస్థులు చూసి పట్టుకునేలోపే వాగులో పడి నీటిప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు.
baludu mruthi