విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం ఏ. కోడూరులో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన లావేటి శశికాంత్ తోటి పిల్లలతో కలిసి ఇంటికి సమీపంలో ఆడుకుంటున్నాడు. ఇంతలో చిన్నపాటి వర్షం పడింది. వర్షంతో పిడుగు పడటంతో శశికాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించినట్లు ఎ. కోడూరు ఎస్సై అప్పలనాయుడు తెలిపారు.
పిడుగుపాటుకు బాలుడు మృతి
తోటి పిల్లలతో ఇంటి సమీపంలో ఆడుకుంటున్నాడు ఓ బాలుడు.. పిడుగు పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన విశాఖ జిల్లా ఏ. కోడూరులో జరిగింది.
పిడుగుపాటుకు బాలుడు మృతి