ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అదృశ్యమైన బాలుడు... విగతజీవిగా చెట్టుకు వేలాడుతూ! - విశాఖ నేర వార్తలు

అదృశ్యమైన తమ కుమారుడు తిరిగి వస్తాడనుకున్న ఆ తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిలింది. ఏ నాటికైనా ఇంటికి రాకపోతాడా అని ఎదురుచూసిన ఆ అమ్మానాన్నలకు.. ఊహించని ఈ ఘటన శరాఘాతంగా మారింది. కనిపించకుండా పోయిన కుమారుడు విగతజీవిగా చెట్టుకు వేలాడటాన్ని చూసి బోరున విలపించారు. ఈ విషాద ఘటన విశాఖపట్నం జిల్లా సిరసపల్లిలో జరిగింది.

boy-death-to-hanging-in-sirasapalli-vizag-district
అదృశ్యమైన బాలుడు... విగతజీవిగా చెట్టుకు వేలాడుతూ

By

Published : Jul 11, 2020, 7:12 PM IST

విశాఖపట్నం జిల్లా పెదబయలు మండలం సిరసపల్లిలో పశువులను మేపడానికి రోహిత్ కుమార్ అనే బాలుడు తన స్నేహితులతో కలిసి అడవికి వెళ్ళాడు. సాయంత్రం అతను తప్ప మిగతా పిల్లలు మాత్రమే గ్రామానికి చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు రోహిత్ గురించి వారిని ప్రశ్నించగా.. చరవాణి ఎక్కడో పడిపోయిందని, దానిని వెతకడానికి వెళ్లాడని చెప్పారు. అదృశ్యమైన బాలుడి కోసం గాలిస్తున్న గ్రామస్థులకు స్థానికంగా ఉన్న కొండపై చెట్టుకు వేలాడుతూ రోహిత్ కుమార్ మృతదేహం కనిపించింది. విగతజీవిగా పడి ఉన్న రోహిత్​ను చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు.

చరవాణి పోగొట్టుకున్నందున ఇంట్లో వాళ్లు మందలిస్తారన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడిని ఎవరో కావాలనే హత్య చేసి, ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతుని తండ్రి కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details