విశాఖపట్టణానికి90కిలోమీటర్ల దూరంలో అనంతగిరి మండలంలో బొర్రా గుహలు ఉన్నాయి.సముద్ర మట్టానికి2300అడుగుల ఎత్తులో తూర్పు కనుమల్లో ఈ గుహలు దాగి ఉన్నాయి.బొర్రా అంటే ఒడిశాలో రంధ్రమని అర్థం.కొండ దిగువన పెద్ద తొర్రలాంటి ప్రదేశం ద్వారా బొర్రా అందాలు చూడవచ్చు.
పర్యాటకుల తాకిడి
వేసవి తాపానికి పర్యాటకులు రద్దీ పెరిగింది.విశాఖ నుంచి అరకు వెళ్లే బస్సులు,కిరాండల్ పాసింజర్ రైలెక్కి బొర్రా గుహలు చేరుకోవచ్చు.గతంలో కాగడాలతో లోనికి వెళ్లే వారు...ప్రస్తుతం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.రంగు రంగుల విద్యుత్ కాంతులు...సున్నపురాయిపై పడి ఈ ప్రకృతి గుహల అందానికి మరింత వన్నె తీసుకొస్తున్నాయి.
అందాలు తనివితీరా ఆస్వాదించాల్సిందే...
ఇంతటి అందాలు ప్రత్యక్షంగా చూస్తే గాని ప్రకృతి రమణీయతను ఆస్వాదించలేం.పర్యాటకుల కేరింతలు,గబ్బిలాలు కీచు శబ్దలతో గుహలో నిత్యం సందడి వాతావరణం కనిపిస్తుంది.కొండ లోపల వేలాడినట్లు కనిపించే శిలా ఖనిజాలు హత్తుకుంటాయి.ఇలాంటి సుందర దృశ్యాలు వీక్షిస్తూ...ఫొటోలు తీసుకుంటూ సందర్శకులతో నిత్యం కిటకిటలాడుతోందీ గుహ.