విశాఖ మన్యంలో బొలెరో వాహనం లోయలోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిరు వ్యాపారులు మృతి చెందారు. చిక్కుళ్లు కొనుగోలు చేసేందుకు లోతుగెడ్డ నుంచి బలపం మీదుగా కోరుకొండ సంతకు వెళ్తుండగా కృష్ణవరం ఘాట్ రోడ్డు మలుపు వద్ద వాహనం అదుపుతప్పింది. బొలెరోపై కూర్చున్న ఇద్దరు వ్యక్తులు లోయలో పడి మృతి చెందారు. మరణించిన వారు బలపం గ్రామానికి చెందిన బచ్చలి వీరయ్య దొర, రాళ్లగడ్డకు చెందిన కొర్ర కామేశ్గా గుర్తించారు. వాహనం నడిపిన యువకుడితో మృతుడి బంధువులు వాగ్వాదానికి దిగారు. మృతదేహాలను చింతపల్లి ఆస్పత్రికి తరలించారు.
మన్యం లోయలో బొలెరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి - Bolero vehicle overturns news
విశాఖ జిల్లా చింతపల్లి మండలం బలపం గ్రామ సమీపంలో బొలెరో వాహనం అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు.
![మన్యం లోయలో బొలెరో వాహనం బోల్తా.. ఇద్దరు మృతి Bolero vehicle overturns in Manyam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10191840-888-10191840-1610284888965.jpg)
బొలెరో వాహనం బోల్తా