అన్నవరం సాగర తీరానికి తెల్లవారుజామున రెండు గంటలకు ఒక బోట్ కొట్టుకువచ్చింది. అయితే విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి రెండు రోజుల క్రితం వేటకు బయలు దేరిన బోటుగా అధికారులు గుర్తించారు. బుధవారం రాత్రి మత్స్యకారులు సముద్రంలో యాంకర్ వేసి నిద్రలోకి జారుకున్నారు. సముద్రంలో ఈదురుగాలులు ఎక్కువగా ఉండడం వల్ల యాంకర్ తెగిపోయింది. ఈ విషయాన్ని అందులో ఉన్న ఆరుగురు మత్స్యకారులు గమనించలేదు. దీంతో బోట్ అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చింది. తేరుకున్న మత్స్యకారులు బోటును అదుపు చేయలేకపోయారు. వారు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఒడ్డుకు చేరుకున్నారు. మత్య్సకారులు వైజాగ్ ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు చెందినవారు. అన్నవరం సాగర తీరానికి కొట్టుకొచ్చిన బోటు కెరటాల తీవ్రతకు రెండుగా చీలిపోయింది. తనకు 20 లక్షల రూపాయల వరకు నష్టం జరిగిందని బోటు యజమాని కోలా నరసింహమూర్తి తీవ్ర ఆవేదన చెందారు.
తీరానికి కొట్టుకొచ్చిన బోట్.. అందరూ సేఫ్ - Boat washed ashore. Everyone is safe
విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి రెండు రోజుల క్రితం వేటకు బయలు దేరిన బోటు అన్నవరం సాగర తీరానికి కొట్టుకుచ్చింది.
తీరానికి కొట్టుకొచ్చిన బోట్.. అందరూ సేఫ్