విశాఖ జిల్లా గొలుగొండ మండలం అమ్మపేట వద్ద తాండవ జలాశయంలో బోటు బోల్తా పడిన ఘటనలో గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. గ్రామానికి చెందిన గంగరాజు అనే మత్స్యకారుడు శనివారం రాత్రి చేపల వేటకు బయలుదేరి ప్రమాదవశాత్తు బోటు బోల్తా పడి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.
తాండవ జలాశయంలో మత్స్యకారుడి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు - boat boltha latest updates
విశాఖ జిల్లా గొలుగొండ మండలం తాండవ జలాశయంలో బోటు బోల్తా పడి మత్స్యకారుడు గల్లంతైన ఘటనలో గాలింపు ముమ్మరంగా సాగుతోంది. పోలీసులు గజ ఈతగాళ్లతో విస్తృతంగా గాలిస్తున్నారు.
![తాండవ జలాశయంలో మత్స్యకారుడి గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు boat boltha in visakha dst gollukonda tandavaa water pool](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7616929-583-7616929-1592148633096.jpg)
boat boltha in visakha dst gollukonda tandavaa water pool