విశాఖపట్నం రామ్‌నగర్ లయన్స్ క్లబ్ లో సర్దార్ భగత్ సింగ్ జయంతి సందర్బంగా ఏఐవైఎఫ్ వారు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిబిరాన్ని సందర్శించిన సీపీఐ నగర కార్యదర్శి ఎం పైడిరాజు రక్తదానం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్న వయస్సులోనే స్వాతంత్య్ర పోరాటంలో బ్రిటిష్ వారిని గడగడలాడించి అసువులు బాసిన యువకిశోరం భగత్‌సింగ్ అన్నారు.
నేటి సమాజంలో రక్త దానం ఎంతో ప్రజాప్రయోజనం కలిగి ఉందని, ఎందరినో ప్రాణాపాయం నుంచి రక్షించే అవకాశం దీని ద్వారా లభిస్తుందని పైడ్రాజు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి కె.సత్యఆంజనేయులు ఏఐవై ఎఫ్ జిల్లా, నగర కార్యదర్శులు బుజ్జి గణపతి, ఇ.వి.వి.సత్యనారాయణ, మధు రెడ్డి, హరీష్రాజు తదితరులు పాల్గొన్నారు.