విశాఖపట్నంలోని రాజా, రమణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ రెడ్డీస్, ఫస్ట బ్లడ్ బ్యాంక్, అవయవదాన్ సహకారంతో వంద మందికి పైగా దాతలు రక్తదానం చేశారు. ఆకస్మికంగా ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు చేపట్టాల్సిన ప్రాథమిక వైద్యంపైనా, అవయవదానం పట్ల ఆవశ్యకతను వివరించారు. గుండెపోటుతో మరణించిన రాజా అనే యువకుడి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని రక్తదాన శిబిర నిర్వాహకులు తెలియజేశారు.
విశాఖలో రక్తదాన కార్యక్రమం - Dr.Reddy's
ఆపదలో రక్తం అవసరమున్న వారికి రక్తదానం చేయటం ఓ మంచి కార్యం. విశాఖలో డాక్టర్ రెడ్డీస్, అవయవదాన్ సహకారంతో రక్తదాన శిబిరం నిర్వహించారు.

విశాఖపట్నంలో రక్తదాన కార్యక్రమం