ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!

చదువుకునే సమయంలోనే కంటి చూపు తగ్గి నిరాశ అలముకుంది.  రానురాను కంటిచూపు పూర్తిగా పోయింది. అయినా వారు నిరాశ చెందలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని తమ సమస్యని అధిగమించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

By

Published : Jan 6, 2020, 7:32 AM IST

అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!
అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!

అంధత్వాన్ని జయించి.. ప్రభుత్వ కొలువు సాధించి!

విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన కాళ్ల శివ శంకర్​కు 2006లో కంటి చూపు తగ్గడం ప్రారంభించింది. ఇది కాస్త ఎక్కువై పూర్తిగా పోయింది. డిగ్రీ చదువుతున్న సమయంలో అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో నిరాశలో ఉన్న శివ శంకర్ కు కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉన్నత చదువులు చదివేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించారు. కష్టపడి ఎంఏ ఇంగ్లీష్, బీఈడీ పూర్తి చేశారు. 2008లో డీఎస్సీ పరీక్ష రాసి 113వ ర్యాంకు సాధించి ఓపెన్ కేటగిరిలోనే సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం అనకాపల్లిలోని న్యూ బర్మా కాలనిలోని జీవీఎంసీ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

అనకాపల్లికి చెందిన బొమ్ములూరి బుచ్చి వెంకటప్రసాద్ కు 1997 లోనే చూపు తగ్గింది. 2002లో పూర్తిగా పోయింది. నిరాశ చెంది కొద్ది కాలం ఇంట్లోనే ఉండిపోయారు. బెంగళూరులోని ఓ సంస్థలో శిక్షణ పొందారు. 2012 లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సాధించారు. అనంతరం బ్యాంకు ఉద్యోగ ప్రవేశ పరీక్షలు రాసి ఎస్బీఐలో ఉద్యోగం సాధించారు. అనకాపల్లిలోని ఎస్బీఐలో ప్రధాన బ్రాంచ్ లో కస్టమర్ అసోసియేట్ గా విధులు నిర్వహిస్తున్నారు.

చదువుకునే సమయంలోనే అంధకారం అలుముకున్నా.. దాన్ని జయించి బతుకులో వెలుగును నింపుకున్న వీరు ఎందరికో ఆదర్శం.

ఇదీ చదవండి: తిరుమలకు వెల్లువలా భక్తులు.. ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details