ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హెచ్చరికలు లేకుండా పేలుళ్లు​.. ఇద్దరికి తీవ్ర గాయాలు

విశాఖ జిల్లాలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిపిన పేలుళ్ల వల్ల ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని రోలుగుంట తహసీల్దార్ కృష్ణమూర్తి తెలిపారు.

blasting without warnings two persons seriously injured
ఇద్దరికి తీవ్ర గాయాలు

By

Published : Jan 6, 2021, 7:50 AM IST

విశాఖ జిల్లా రోలుగుంటలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా చేసిన బ్లాస్టింగ్​ వల్ల ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. నాతవరం మండలం శరభవరం గ్రామానికి చెందిన శివ, కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తులు రోలుగుంటలోని ఓ వేడుకకు బయల్దేరారు.

నర్సీపట్నం నుంచి ద్విచక్రవాహనంపై బయలుదేరిన వీరు.. రోలుగుంట సమీపంలోకి రాగానే బ్లాస్టింగ్ జరిగింది. నూకరాజు అనే వ్యక్తి క్వారీలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా బ్లాస్టింగ్ చేశారు. పేలుడు ధాటికి బయటికి వచ్చిన రాళ్లు.. శివ, రాజుకు తగిలి గాయాలయ్యాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని రోలుగుంట తాహసీల్దార్ కృష్ణమూర్తి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details