నూతన వ్యవసాయ చట్టాలను వంటనే రద్దు చేయాలని విశాఖ జిల్లా అనకాపల్లిలో సీఐటీయూ నాయుకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు రైతు, కార్మిక సంఘాల సభ్యులు స్థానిక సీఐటీయూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం నెహ్రూ కూడలి వద్ద మానవహారం నిర్వహించారు. పరమేశ్వరి పార్కు వద్ద బ్లాక్ డే నిర్వహించారు.
సాగు చట్టాల రద్దు కోరుతూ ఆరు నెలలుగా రైతులు పోరాటం చేస్తున్నా.. కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని రైతు, కార్మిక సంఘాల నాయకులు బాలకృష్ణ, పరమేశ్వరరావు అన్నారు. బిల్లులు రద్దు చేయాలని.. లేనిపక్షంలో ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.