ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విలేకరులకు అండగా ఉండాలన్నదే మా లక్ష్యం' - BJYM State Vice President

విశాఖపట్నంలోని జర్నలిస్టులకు గృహాలు నిర్మించాలనే లక్ష్యంతో కాటూరి వీరన్న ఛారిటబుల్ ట్రస్ట్... కృషి చేస్తోందని ఆ సంస్థ వ్యవస్థాపకులు రవీంద్ర తెలిపారు. విలేకరుల సంక్షేమమే తమ ప్రధాన అజెండా అని పేర్కొన్నారు. నగరంలోని శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబురాల్లో ఆయన పాల్గొన్నారు.

BJYM
బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

By

Published : Jan 13, 2021, 1:33 PM IST

అర్హులైన జర్నలిస్టులకు పక్కా గృహాలు నిర్మించేందుకు కాటూరి వీరన్న ఛారిటబుల్ ట్రస్ట్ సిద్ధంగా ఉందని... ఆ సంస్థ వ్యవస్థాపకులు, భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటూరి రవీంద్ర అన్నారు. విశాఖలోని మధురవాడ శిల్పారామంలో స్మార్ట్ సిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ నిర్వహించిన... సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు.

స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తొలి అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. నగర పరిధిలో చాలా మంది జర్నలిస్టులు సొంత ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. విలేకరులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో కాటూరి చారిటబుల్ ట్రస్ట్... ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు.

ABOUT THE AUTHOR

...view details