ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయండి'

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం అమలు చేసిన అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ల​ను రాష్ట్రంలోనూ అమలు చేయాలని భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే ఈ అంశంపై నిర్ణయం తీసుకోకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయండి
అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయండి

By

Published : Nov 17, 2020, 3:52 PM IST

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్ర వర్ణాలలో పేదలకు కేటాయించిన 10 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అగ్రవర్ణాల్లోని పేదలకు అవకాశాలు కల్పించే విధంగా కేంద్రం తీసుకువచ్చిన చట్టాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. ఇప్పటికే పలు విధాలుగా సర్కార్​కు తమ సమస్యను విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయండి

ధర్నా చౌక్​లో నిరసన

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో పేదలకు విద్య, ఉద్యోగాల్లో కల్పించిన 10 శాతం రిజర్వేషన్లను రాష్ట్రంలోనూ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భాజపా యువమోర్చా ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్​లో నిరసన కార్యక్రమం చేపట్టారు.

అగ్రవర్ణాలకు 10శాతం రిజర్వేషన్లు అమలు చేయండి

ఎందుకింత జాప్యం

కేంద్ర సర్కార్ అగ్రవర్ణ కులాల పేదలకు 10శాతం రిజర్వేషన్ అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అమలు చేయకుండా జాప్యం చేస్తుందని భాజపా విజయనగరం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని విమర్శించారు. 10శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఇవీ చదవండి

'గ్రంథాలయం ఏర్పాటుతో.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details