విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఏఎస్ఆర్ నగర్లో ఇళ్ల నిర్మాణం కోసం చేసిన నిరసనలో భాగంగా భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకమంతా రావాలి జగన్.. కావాలి జగన్ అన్నారని.. తాను కూడా ప్రచారంలో తెదేపాకు ఓటు వేయొద్దని.. తనకు ఓటు వేయకున్నా పర్లేదని చెప్పినట్లు తెలిపారు. జగన్మోహన్ రెడ్డికి అద్భుతమైన మెజార్టీ రావడంతో సంతోషించానని చెప్పారు. ఇప్పుడు జగన్ చేసే పనులు చూస్తే.. దారుణంగా ఉన్నాయని విష్ణుకుమార్ రాజు విమర్శించారు. ప్రజలకు అన్యాయం జరుగుతుందని చెప్పుకుందామంటే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
భారతమ్మను సీఎం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు: విష్ణుకుమార్ రాజు
విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని ఏఎస్ఆర్ నగర్లో నిలిచిన ఇళ్ల నిర్మాణం అంశంపై భాజపా నేత, మాజీ శాసన సభ్యుడు విష్ణుకుమార్ రాజు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారతమ్మను సీఎం చేస్తే ప్రజలు సంతోషంగా ఉంటారు: విష్ణు కుమార్ రాజు
రెండున్నరేళ్లయిన తర్వాత మంత్రులందరినీ మారుస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. నాకు అనిపిస్తోంది... జగన్మోహన్ కూడా పక్కకు తప్పుకొని.. ఆయన భార్య భారతమ్మను ముఖ్యమంత్రిగా చేయాలి. మిగిలిన కాలమైనా ప్రజలు సంతోషంగా ఉంటారు. -విష్ణుకుమార్ రాజు, భాజపా నేత
ఇదీ చదవండి:ముక్కు ద్వారా ఇచ్చే టీకాపై వచ్చే నెల క్లినికల్ పరీక్షలు