ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మధ్య, చిన్నతరహా పరిశ్రమలను కేంద్రం ఆదుకుంటుంది: భాజపా - 'మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల రంగాలను ఆదుకుంటాం'

రాష్ట్రంలోని మధ్య, చిన్న తరహా పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆదుకుంటున్నట్లు భాజాపా నేతలు సురేష్ ప్రభు, జీవీఎల్​ స్పష్టం చేశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజ్​లో ఏపీ ఎంఎస్ఎంఈలకు న్యాయం జరగలేదనే వ్యాఖ్యలు సరికావన్నారు.

'మధ్య, చిన్నతరహా పరిశ్రమల రంగాలను ఆదుకుంటాం'
'మధ్య, చిన్నతరహా పరిశ్రమల రంగాలను ఆదుకుంటాం'

By

Published : Jun 30, 2020, 10:34 PM IST

విశాఖ భాజపా కార్యాలయం నుంచి వర్చువల్ ఇంటలెక్చవల్ ర్యాలీ 2020 నిర్వహించారు. కరోనా తరువాత రాష్ట్రంలో నెలకొన్న ఆర్ధిక అంశాలు.. మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమల రంగం సమస్యలపై భాజాపా నేతలు సురేష్ ప్రభు, జీవీఎల్ నరసింహారావు మాట్లాడారు. ఎమ్మెల్సీ మాధవ్, భాజపా నేతలు విష్ణు కుమార్ రాజు, కంభంపాటి హరిబాబు ఈ డిజిటల్ ర్యాలీలో పాల్గొన్నారు.

రాష్ట్రంలోని మధ్యతరహా, చిన్నతరహా పరిశ్రమలను ఆదుకుంటున్నట్లు సురేష్ ప్రభు, జీవీఎల్​ స్పష్టం చేశారు. ప్యాకేజ్​లో ఏపీ ఎంఎస్ఎంఈలకు న్యాయం జరగలేదనే వ్యాఖ్యలు సరికావన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే.. తమ దృష్టికి తేవాలని నేతలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details