ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

SOMU VEERRAJU: 'కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా చెప్పుకుంటోంది' - భాజపా నాయకుడు సోము వీర్రాజు తాజా సమచారం

విశాఖ ఉక్కు నష్టాల్లో ఉందని ఏటా కేంద్రం రూ.1300 కోట్లు వెచ్చిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్ర నాయకులు ప్రైవేటీకరణను ఎప్పుడో స్వాగతించారని తెలిపారు. అందులో భాగంగానే డెయిరీలు, చక్కెర మిల్లులు అమ్మేశారని చెప్పారు. వాటి అమ్మకంలో అడ్డు చెప్పని రాష్ట్ర నాయకులు.. విశాఖ ఉక్కు విషయంపై ప్రశ్నించటం ఏమిటన్నారు.

BJP leader Somu Veerraju
భాజపా నాయకుడు సోము వీర్రాజు

By

Published : Aug 6, 2021, 2:22 PM IST

Updated : Aug 6, 2021, 7:01 PM IST

విశాఖ స్టీల్ ప్లాంట్​కు ఎలాంటి అన్యాయం జరగదని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అన్యాయం జరగదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. విశాఖ భాజపా కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. దేశంలో మరే ఏ పార్టీ చెయ్యని విధంగా ఉక్కు నిర్వాసితులను ఢిల్లీలో కేంద్ర ఉక్కు మంత్రి కలిసేలా సహకారం చేసినట్టు చెప్పారు. అమృత పథకం కింద స్మార్ట్ సిటీ డెవలప్​మెంట్​ కార్యక్రమానికి వేలాది కోట్ల రూపాయలు ఇచ్చినట్టు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి పన్ను పెంచాల్సిన అవసరం లేదన్నారు. ఆ పన్నును వ్యతిరేకిస్తూ.. పోరాటం కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 16 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చిందని తెలిపారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సొమ్ముతో.. జగనన్న సొంతింటి కల బొమ్మలు వేసుకుంటున్నారని విమర్శించారు.

సర్వ శిక్షా అభియాన్​లో భాగంగా దేశంలో పాఠశాలలో మౌలిక సదుపాయాలకు కేంద్రం నిధులు ఇస్తోంది. ఆ పథకంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాలు 60:40 పద్ధతిలో స్కూల్ భవనాలు నిర్మించాలి. ఇప్పటికే కేంద్రం రూ.5 వేల కోట్లు ఇచ్చింది.. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వలేదు. చివరికి విద్యార్థులకు యూనిఫామ్ కేంద్రం ఇస్తుంటే కూడా జగనన్న యూనిఫామ్​ అని పెట్టుకుంటున్నారు. జల జీవన్ మిషన్​లో భాగంగా ప్రతి ఇంటికి శుద్ధమైన నీళ్లు ఇవ్వాలని రూ.5వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలో పర్యటించి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులపై ఫిర్యాదు అందించాము. జలశక్తి , రైల్వే, మత్స్య, గిరిజన సంక్షేమ, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ మంత్రులను కలిశాము. పోలవరం నిర్వాసితుల సమస్య , ఆర్​ఆర్​ ప్యాకేజీ, గిరిజన ఇబ్బందులపై చర్చ జరిగింది. పోలవరం ప్రాజెక్ట్ బకాయిలు ఉన్నా రూ.430కోట్లు త్వరలో విడుదలకు కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి రూ.35వేల కోట్లు కేంద్రం ఇచ్చింది. స్వాతంత్య్రం వచ్చాక ఎవరూ ఇన్ని నిధులు ఇవ్వలేదు. - సోము వీర్రాజు

ఇదీ చదవండీ..Amaravathi: న్యాయస్థానం టూ దేవస్థానం..

Last Updated : Aug 6, 2021, 7:01 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details