ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కలెక్టరేట్ కార్యాలయం ముందు భాజపా దళిత మోర్చా ధర్నా - విశాఖ పట్నం ముఖ్యంశాలు

ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను తక్షణమే లబ్దిదారులకు అందజేయాలని ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలను మంజూరు చేయాలని భాజపా ఎస్సీ సెల్ నాయకులు విశాఖలో డిమాండ్ చేశారు.

కలెక్టరేట్ కార్యాలయం ముందు భాజపా దళిత మోర్చా ధర్నా
కలెక్టరేట్ కార్యాలయం ముందు భాజపా దళిత మోర్చా ధర్నా

By

Published : Mar 30, 2021, 3:38 PM IST

విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట భాజపా ఎస్సీ సెల్ నాయకులు ప్లకార్డులు పట్టుకుని నిరసన చేపట్టారు. ఎస్సీ సబ్​ప్లాన్ నిధులను తక్షణమే లబ్ధిదారులకు అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని కోరారు.

చదువుకుని.. ఉద్యోగాలు లేని యువత పెడదోవ పడుతున్నారని విశాఖ ఎస్సీ సెల్ పార్లమెంటరీ అధ్యక్షుడు అన్నారు. ప్రభుత్వం తక్షణమే సబ్​ప్లాన్ నిధుల ద్వారా నిరుద్యోగ యువతకు వాహనాల కొనుగోలుకు, దుకాణాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్​ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details