ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు ఇళ్ల కేటాయింపులో జాప్యంపై భాజపా నిరసన - పేదలకు ఇళ్ల కేటాయింపులో జాప్యంపై భాజపా నిరసన

పేదలకు ఇళ్లు కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై విశాఖ జిల్లా అనకాపల్లిలో భాజపా నాయకులు నిరసన చేపట్టారు. జనసేన నాయకులు మద్దతు పలికారు.

BJP protests on delay in allocation of houses to poor
పేదలకు ఇళ్ల కేటాయింపులో జాప్యంపై భాజపా నిరసన

By

Published : Jul 22, 2020, 7:09 PM IST

పేదలకు ఇళ్లు కేటాయించడంపై కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేయడంపై విశాఖ జిల్లా అనకాపల్లిలో భాజపా నాయకులు నిరసన చేపట్టారు. పేదల ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు భాజపా అనకాపల్లి పార్లమెంటు నియోజవర్గ అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ. గతంలో పాలించిన చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఇటుకలో చంద్రన్న, అవినీతి-అడుగు అడుగులో వైకాపా అరాచకాలు’ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు.

గత ఆరేళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి 11 లక్షల ఇళ్లు కేటాయించారని తెలిపారు. ప్రతి లబ్దిదారునికి కేంద్రం వాటా కింద 1.5 లక్షలతో ఇల్లు నిర్మించినా వాటిని అర్హులకు అందించకపోవడం దారుణమని విమర్శించారు. వెంటనే పేదల సొంతింటి కల నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కమళ దళానికి జనసేన నాయకులు మద్దతు పలికారు.

ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు పరమేశ్వర రావు, కర్రి రామకృష్ణ, నాగేశ్వర రావు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: జీ ప్లస్ త్రీ గృహాలు లబ్ధిదారులకు ఇవ్వాలని జనసేన నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details