ప్రభుత్వ విధానాలుపై ప్రజా వ్యతిరేకంగా ఉన్నాయంటూ.. అరకు పార్లమెంటరీ భాజపా అధ్యక్షులు ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో పాడేరులో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని భాజపా నాయకులు నిరసన తెలియజేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపు, ప్రభుత్వ భూముల అమ్మకం, రైతు వ్యతిరేక విధానాలను నిరసించారు. ప్రభుత్వం తక్షణమే ఇలాంటి చర్యలను మానుకోవాలని డిమాండ్ చేశారు.