BJP Purandeshwari: రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన సాగుతోందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి విమర్శించారు. మద్యం కుంభకోణంలో శరత్చంద్ర రెడ్డి అరెస్టయ్యారని.. ఆయన ఎవరి బంధువో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అవినీతి, ఆక్రమణలు తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదనేందుకు ఇదే నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రజావేదిక కూల్చివేతతో వైకాపా పాలన ప్రారంభమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.
అవినీతి, ఆక్రమణలు తప్ప వైకాపా ప్రభుత్వం చేసిందేమీ లేదు: పురందేశ్వరి - BJP Purandeshwari Latest Comments
Purandeshwari: రాష్ట్రంలో వైకాపా పాలనపై భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి అగ్రహాం వ్యక్తం చేశారు. వైకాపా పాలన దారుణంగా ఉందని మండిపడ్డారు. పేదలకు అన్యాయం జరుగతోందని ఆరోపించారు.

పురందేశ్వరి
జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి
"రాష్ర్టంలో విధ్వంసకరమైన పాలన సాగుతోంది. మొన్న జరిగిన ఇప్పటం విధ్వసం ప్రజలందరూ చూస్తున్నారు. అదేవిధంగా విశాఖలో జరిగిన కూల్చివేతలు కావచ్చు. విశాఖలో భూముల విషయానికి వస్తే ఏ విధంగా అక్రమణకు గురవుతున్నాయో ఏవరికి తెలియనటువంటి విషయం కాదు. పేదలకు అందవలసిన పథకాలు కూడా సరియైన పద్ధతిలో అందటం లేదు." -పురందేశ్వరి, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి: