BJP MP GVL Narasimha Rao: విశాఖలోని రిఫైనరీ ప్రాజెక్టు ఆధునీకరణను కేంద్ర ప్రభుత్వం చేపట్టిందని భాజపా ఎంపీ జీవీఎల్ అన్నారు. ఇందుకోసం భారీ స్థాయిలో రూ.26 వేల కోట్లను ఖర్చు పెడుతోందని చెప్పారు. రిఫైనరీ సామర్థ్యం 15 మిలియన్ టన్నులకు పెంచాలని కేంద్రం నిర్ణయించిందని.. హెచ్‌పీసీఎల్ చరిత్రలోనే ఇంతటి భారీ ప్రాజెక్టు ఇదే మొదటిసారి అని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ప్రాజెక్టు ముగించాలనేది కేంద్రం లక్ష్యమని వెల్లడించారు.
"రిఫైనరీ ప్రాజెక్ట్ ఆధునీకరణతో ఇంధన రక్షణ, ఇంధన సంక్లిష్టత మెరుగుదల, ఇతర ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల మందికి ఉపాధి దొరుకుతుంది. రాష్ట్రాభివృద్ధికి, పన్నుల రూపంలో ఆదాయానికి ప్రాజెక్టు దోహదపడుతుంది" - జీవీఎల్, భాజపా ఎంపీ