వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ, భాజపా నాయకుడు పి.వి.మాధవ్ అన్నారు. విశాఖ జిల్లా చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ పర్యటించారు. చోడవరం మండలం కన్నంపాలెంలో నీట మునిగిన వరి, చెరకు పొలాలను పరిశీలించారు.
సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది: ఎమ్మెల్సీ మాధవ్ - విశాఖ తాజా వార్తలు
వరద సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైందని భాజపా ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. విశాఖ జిల్లా చోడవరం, బుచ్చెయ్యపేట మండలాల్లోని ముంపునకు గురైన పంటపొలాల్ని ఆయన పరిశీలించారు. పంట నష్టంపై రైతులతో మాట్లాడారు.
Bjp mlc madhav
రైతులతో మాధవ్ మాట్లాడారు. క్షేత్రస్థాయి పరిశీలన చేసి ఆదుకోవాల్సిన యంత్రాంగం కార్యాలయాలకే పరిమితమవ్వడం వల్ల ముంపు బాధితులు ఆవేదన చెందుతున్నారన్నారు. నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :శారద పీఠానికి కొత్త లోగో రూపకల్పన.. ఆవిష్కరించిన పీఠాధిపతులు