ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TAX PROTEST: ఇంటి పన్ను, చెత్తపన్నులపై రాష్ట్రవ్యాప్త నిరసనలు - vishakapatnam latest news

ఇంటి పన్నులు, చెత్త పన్నుల పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల శ్రేణులు నిరసన చేపట్టాయి. కరోనా వల్ల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఈ క్రమంలో పేద, మద్య తరగతి ప్రజలపై పన్నుల భారం మోపడం దారుణమని నేతలు విమర్శించారు.

ఇంటి పన్ను, చెత్తపన్నులపై  భాజపా ఆధ్వర్వంలో నిరసనలు
ఇంటి పన్ను, చెత్తపన్నులపై భాజపా ఆధ్వర్వంలో నిరసనలు

By

Published : Jul 3, 2021, 5:32 PM IST

ఇంటి పన్నులు, చెత్త, మురుగు నీటి పన్నుల పెంపును నిరసిస్తూ విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సీఐటీయూ ఆధ్యర్యంలో నిరసన చేపట్టారు. ప్రజలపై భారాన్ని మోపడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రజా వ్యతిరేకతను చాటుతుందని సీఐటీయూ విమర్శించింది. పెంచిన పన్నుల భారాన్ని ఉపసంహరించాలని నినాదాలు చేశారు.

గాజువాకలో భాజపా నేతలు నిరసన చేపట్టారు. కరోనా భారంతో ప్రజలు తీవ్ర భాధలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పన్నుల భారం మోపడం అన్యాయమని పార్టీ కన్వీనర్ కాన్నంరెడ్డి నర్సింగ్ రావు ఆగ్రహించారు. పార్టీ గాజువాక కన్వీనర్ కన్నంరెడ్డి నరసింహరావు, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.

విజయవాడలో...

సామన్యుని నడ్డివిరిగేలా ఇంటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త పన్ను విధిస్తూ కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిందని పౌర సమాజ్య, ప్రతిపక్ష పార్టీల నాయకులు విజయవాడలో విమర్శించారు. మున్సిపల్ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం తెచ్చిన కొత్త జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. పాత పన్ను చట్టాన్నే కొనసాగించాలన్నారు.

ఇదీ చదవండి:

వివాహ బంధానికి ఆమిర్ ఖాన్ దంపతుల గుడ్​బై

ABOUT THE AUTHOR

...view details