తిరుమల తిరుపతి దేవస్థానం భూముల పరిరక్షణ కు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ భాజాపా నాయకులు విశాఖ జిల్లా పాయకరావుపేటలో నిరసన తెలిపారు.
శ్రీవారి భూములు అమ్మకాలు చేపట్టే ప్రక్రియ ప్రభుత్వం పూర్తిగా మానుకోవాలని సూచించారు. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా చర్యలు చేపడితే రాష్ట్రవ్యాప్తంగా నిరసన తీవ్రం చేస్తామని హెచ్చరించారు.