రామతీర్థం సందర్శనకు భాజపాని అనుమతించాలంటూ ఆ పార్టీ నేతలు విశాఖపట్నంలో ధర్నా చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో ప్రభుత్వం స్పందన సరిగా లేదని, దీనిపై ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
'రామతీర్థం సందర్శనకు అనుమతి ఇవ్వాలి' - ramatheertham insident
విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భాజపా అధ్యక్షుడు సహా పార్టీ నేతలు ఆందోళన చేశారు. రామతీర్థం సందర్శనకు తమను అనుమంతించాలంటూ నినాదాలు చేశారు.

విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భాజపా నేతల ఆందోళన