విశాఖలోని విమానాశ్రయాన్ని తీసేయాలంటూ... ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేఖ రాయడాన్ని ఎమ్మెల్సీ మాధవ్ తప్పుబట్టారు. భోగాపురం విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన తరువాతే విశాఖ విమానాశ్రయంపై తదుపరి చర్యలు తీసుకోవాలని సూచించారు. నెలకు రెండు లక్షల మంది రాకపోకలు సాగించే విశాఖ విమానాశ్రయాన్ని మూసివేస్తామనడంపై భాజపా నేత విష్ణుకుమార్ రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
విజయసాయిరెడ్డి లేఖపై భాజపా నేతల అభ్యంతరం - భాజపా నేత విష్ణుకుమార్ రాజు
ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ రాయడంపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం విమానాశ్రయాన్ని నిర్మించిన తర్వాతే... విశాఖ విమానాశ్రయంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
విజయసాయిరెడ్డి లేఖపై భాజపా నేతల అభ్యంతరం