విశాఖ జిల్లా కోటవురట్ల మండలంలోని రహదారుల పరిస్థితి అధ్వానంగా మారటంపై భాజపా నాయకుడు యన్. గంగబాబు ఆధ్వర్యంలో కార్యకర్తలు రాస్తారోకో చేశారు. ప్రధాన కూడళ్లలో భారీ గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరారు.
రహదారులకు మరమ్మతులు చేయాలని భాజపా రాస్తారోకో - విశాఖ తాజా వార్తలు
రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ...భాజపా నేతలు రాస్తారోకో చేశారు. రోడ్డు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
రహదారుల కోసం భాజపా రాస్తారోకో