రాష్ట్ర ప్రభుత్వం సింహాచల దేవస్థానం ఛైర్‌పర్సన్‌గా సంచయిత గజపతిరాజును నియమించడంపై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భాజపా అధిష్ఠానంతో చెప్పకుండా ఆమె నిర్ణయం తీసుకోవడాన్ని భాజపా ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తప్పుబట్టారు. ప్రస్తుత ఛైర్మన్ అశోక్ గజపతిరాజుకు సమాచారం ఇవ్వకుండా.. ఛైర్మన్‌ను మారుస్తూ రాత్రికి రాత్రే ప్రభుత్వ జీవోలు ఇవ్వడం దారుణమని అన్నారు. విశాఖను రాజధానిగా చేస్తోన్న సమయంలో దేవాలయ భూములపై అధికార పార్టీ కన్ను పడిందని మాధవ్ ఆరోపించారు. నూతన ఛైర్మన్ నియామకం ఒక రాజకీయ దుర్మార్గపు చర్యగా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభివర్ణించారు.
సింహాచల దేవస్థాన ఛైర్మన్‌గా సంచయిత నియామకంపై భాజపా ఆగ్రహం - BJP leaders fired on simhachala trust chirperson sanchiha apppintment
సింహాచల దేవస్థాన ఛైర్మన్‌గా సంచయిత గజపతిరాజు నియామకంపై భాజపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఛైర్మన్‌గా ఉన్న అశోక్ గజపతి రాజుకు సమాచారం ఇవ్వకుండా ఆమెను ఛైర్‌పర్సన్‌గా నియమించడాన్ని ఖండించారు.
BJP leaders fired on simhachala trust chirperson sanchiha apppintment