విశాఖ మన్యం పాడేరు మండలం కుజ్జలీ పంచాయతీలోని చిడ్డిపాలెం గిరిజనులకు.. భాజపా చైతన్య ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కిట్లు పంపిణీ చేశారు. మోదీ కిట్ పేరుతో కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. భౌతిక దూరం పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు కురుసా రాజారావు పాల్గొన్నారు.
విశాఖ మన్యం గిరిజనులకు 'మోదీ కిట్లు' - పాడేరు గిరిజనులకు భాజపా సాయం
విశాఖ జిల్లా మారుమూల ప్రాంతాల్లోని గిరిజనులకు మాస్కులు, కూరగాయలు అందించారు.. భాజపా చైతన్య ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు.
విశాఖ మన్యం గిరిజనులకు మోదీ కిట్లు పంపిణీ