రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితిని పట్టించుకోని...ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశాఖలో భాజపా ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నగర పరిధిలో రహదార్లు చాలా వరకు అధ్వాన్న స్దితిలో ఉన్నప్పటికి అధికార్లు వాటి మరమ్మత్తులకు చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పాడైపోయిన రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. రహదార్ల మరమ్మత్తులు చేసేందుకు కనీస స్థాయిలో కూడా నిధులు విడుదల చేయకపోవడం వల్లనే ఈ పరిస్ధితి దాపురించిందని విమర్శించారు.
'రహదారులకు మరమ్మతులు చేయండి' - BJP demands repair of roads in Visakhapatnam
రహదారులకు మరమ్మతులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ...భాజపా నేతలు రాస్తారోకో చేశారు. రోడ్డు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని అన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికి పట్టించుకోవటం లేదని ఆరోపించారు.
రహదారులకు మరమ్మతులు చేయండి