ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఇది రద్దులు, కూల్చివేతల ప్రభుత్వం' - విష్ణుకుమార్ రాజు అప్​డేట్

రాష్ట్ర ప్రభుత్వంపై భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. ఇది రద్దుల ప్రభుత్వమన్నారు.

bjp leader vishnu kumar raju on housing scheme
విష్ణుకుమార్ రాజు

By

Published : Oct 6, 2020, 11:12 PM IST

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. పేదలకు పంపిణీ చేసే ఇళ్ల నిర్మాణాలు ఆపేశారనీ.. టెండర్లు రద్దు చేశారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. విశాఖలో ఇచ్చిన ఇళ్ల దరఖాస్తులను రద్దు చేయటం దారుణమని అన్నారు. వైకాపా ప్రభుత్వం, రద్దుల ప్రభుత్వం.. కూల్చివేతల ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ప్రభుత్వ అనాలోచిత చర్యల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనీ.. ముఖ్యమంత్రి జగన్ గమనించాలని సూచించారు.

ఆంధ్రప్రదేశ్​లో భాజాపా భవిష్యత్తు చాలా బాగుంటుందనీ.. జగన్ పాలన మీద ప్రజలు విసిగెత్తిపోయారని విష్ణుకుమార్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన భాజపా కలిసి రాష్ట్రంలో అధికారంలోకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. గంటా శ్రీనివాసరావు... పార్టీ మారుతారనే ఊహాగానాలపై స్పందించాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details