విజయనగరం జిల్లాలోని.. శ్రీ రాముని పుణ్యక్షేత్రంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. విశాఖ జిల్లా, అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద భాజపా అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షుడు సత్యనారాయణ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వైకాపా ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'వైకాపా ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి' - విశాఖపట్నం సమాచారం
వైకాపా పాలనలో హిందూ దేవాలయాలకి రక్షణ కరువైందని భాజపా అనకాపల్లి పార్లమెంటు అధ్యక్షుడు డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా శ్రీరాముని పుణ్యక్షేత్రంలోని రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ.. విశాఖ జిల్లా అనకాపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు.
'వైకాపా ప్రోత్సాహంతోనే హిందూ దేవాలయాల పై దాడులు జరుగుతున్నాయి'