Purandeswari Comments: వైకాపా ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ప్రజాపోరు యాత్ర అని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితి లేదని.. పెట్టుబడుల రాకకు కావాల్సిన వసతుల కల్పనలో రాష్ట్రం విఫలమైందని మండిపడ్డారు. ఏ ప్రభుత్వంపైన లేని కేసులు ఏపీ ప్రభుత్వంపై ఉన్నాయని విమర్శించారు. మద్యనిషేధంపై హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ధ్వజమెత్తారు.
ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే.. పేరు మార్పు సరికాదు: పురందేశ్వరి - ntr health university as ysr health university
BJP leader Purandeswari: ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పేర్లు మారినా.. చాలా వరకు ఎన్టీఆర్ పెట్టిన పథకాలే అమలవుతున్నాయన్నారు. కారణం లేకుండా పేరు మార్పు ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమేనని స్పష్టం చేశారు.
BJP PURANDESWARI
ఎన్టీఆర్‌పై గౌరవం అంటూనే ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు సరికాదని హితవు పలికారు. ఎన్టీఆర్ సామాజిక డాక్టర్ అని.. పేర్లు మారినా చాలావరకు ఎన్టీఆర్ పెట్టిన పథకాలే అమలవుతున్నాయన్నారు. కారణం లేకుండా పేరు మార్పు ఎన్టీఆర్‌కు జరిగిన అవమానమని తేల్చిచెప్పారు.
ఇవీ చదవండి:
Last Updated : Sep 22, 2022, 7:09 PM IST