ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా నేత లోకుల గాంధీకి.. నేతల నివాళి - bjp leader gandhi death

విశాఖ పాడేరు మన్యంలో బలమైన నేతగా.. భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగిన లోకుల గాంధీ మృతిపై.. నేతలు నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.

భాజపా నేత లోకుల గాంధీకి నేతల ఘన నివాళి
భాజపా నేత లోకుల గాంధీకి నేతల ఘన నివాళి

By

Published : Aug 21, 2021, 6:53 PM IST

విశాఖ పాడేరు మన్యంలో చిరునవ్వుల ధ్రువతార నేలకొరిగింది. అంచెలంచెలుగా ఎదిగి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పదవి నిర్వర్తిస్తున్న లోకుల గాంధీ అకాల మరణాన్ని అక్కడి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన పార్థివదేహాన్ని కొయ్యూరు మండలంలోని స్వగ్రామమైన శరభన్నపాలెం తరలించారు.

నివాళులు అర్పించేందుకు భారీగా నాయకులు, కార్యకర్తలు, వివిధ పార్టీల నేతలు అక్కడికి చేరుకున్నారు. భాజపా కేంద్ర కార్యదర్శి సునీల్ దియోధర్, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ ఇతర నేతలు నివాళులర్పించారు. గాంధీ కుటుంబానికి ధైర్యం చెప్పారు. మన్యంలోని గిరిజనులు గాంధీకి కన్నీటి వీడ్కోలు పలికారు.

ABOUT THE AUTHOR

...view details