విశాఖ జిల్లా నర్సీపట్నంలో భాజపా-జనసేన నాయకులు సంయుక్తంగా నిరసనకు దిగారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తైనా... లబ్ధిదారులకు కేటాయించకపోవటంపై నేతలు ఆందోళన చేశారు. నర్పీపట్నం మున్సిపాలిటీలో నిర్మించిన గృహ సముదాయాలపై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా... ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోయారని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి పేదలకు ఇళ్లను కేటాయించాలని సూచించారు.
నర్సీపట్నంలో జనసేన-భాజపా నేతల నిరసన - నర్సీపట్నం జనసేన నాయుకుల నిరసన
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా.. ఇళ్ల లబ్ధిదారులకు న్యాయం చేయలేకపోయారని భాజపా, జనసేన నాయకులు ఆరోపించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో నిరసన చేపట్టిన నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు.
నర్సీపట్నంలో జనసేన-భాజపా నేతల నిరసన