విశాఖ బక్కనపాలెం శ్మశాన వాటికలో గ్యాస్ ఆధారిత శ్మశానవాటిక, మార్చురీ నిర్మాణ ప్రతిపాదనను తక్షణమే విరమించాలని డిమాండ్ చేస్తూ జనసేన- భాజపా కార్యకర్తలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. నివాసాల మధ్య ఉన్న శ్మశాన వాటికలో కొవిడ్ మృతుల దహన సంస్కారాలు జరుగుతాయంటేనే స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.
శ్మశాన వాటిక నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన - bjp- janasena protest in bakkana palem
కొవిడ్ మృతులకు దహన సంస్కారాలు చేసేందుకు బక్కనపాలెం శ్మశాన వాటికలో గ్యాస్ ఆధారిత శ్మశానవాటిక నిర్మాణానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని భాజపా- జనసేన సంయుక్తంగా ఆదివారం నిరసన చేపట్టాయి. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆ పార్టీల నాయకులు తెలిపారు.
bjp- janasena protest against gas based crematorium in bakkanapalem
గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక నిర్మాణానికి ఊరి శివార్లలోని శ్మశాన వాటికలను ఎంపిక చేయాలని సూచించారు. జిల్లా యంత్రాంగం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ భాజపా- జనసేన కార్యకర్తలు నిరసన ర్యాలీ నిర్వహించారు.