ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

New Education Policy: 'నూతన విద్యా విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సాహపడుతోంది'

Safforanisation Of Education: కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం ద్వారా విద్యను కాషాయీకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విద్యా సదస్సులో విద్యా, సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ మాట్లాడారు.

Education
Education

By

Published : May 23, 2023, 6:10 PM IST

Safforanisation Of Education: నూతన విద్యా విధానం ద్వారా విద్యను కాషాయీకరణ చేసేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం యత్నిస్తోందని విద్యా, సామాజికవేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ, అఖిలభారత విద్యాహక్కు వేదిక ఆధ్వర్యంలో విశాఖ పౌర గ్రంథాలయంలో విద్యా సదస్సు నిర్వహించారు. నూతన విద్యా విధానం ద్వారా అనేక చారిత్రక అంశాలను పాఠ్యాంశాల నుంచి తొలగించి తమకు అనకూలమైన అంశాలను జోడించి పాఠ్యాంశాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్ రమేష్ పట్నాయక్ అన్నారు.

ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య కు సంబంధించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వాలు స్వతంత్రంగా రూపొందించే అవకాశం ఉన్నప్పటికీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు ఉత్సాహ పడుతోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర సాంస్కృతి, విద్యావసరాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సొంత విద్యా విధానాన్ని రూపొందించుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. మన పురుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ తో పాటు కేరళ, ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాలు నూతన విద్యా విధానం కాకుండా తమ సొంత విద్యా విధానాలను అమలు చేస్తున్నాయని రమేష్ పట్నాయక్ వివరించారు. కార్యకారణ సంబంధం కలిగిన శాస్త్రీయ విద్య స్థానంలో సావర్కర్ వంటి వ్యక్తుల జీవిత చరిత్రలను , ఆశాస్త్రి అంశాలను పాఠ్యాంశాలలో చేర్చేందుకు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నూతన విద్యా విధానం ద్వారా యత్నిస్తోందని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్ ఆందోళన వ్యక్తం చేశారు.

భారతీయ జనతా పార్టీ ఈ వైఖరిని మురళీ మనోహర్ జోషి కేంద్ర విద్యా మంత్రిగా ఉన్నప్పటి నుంచి అనుసరిస్తుందన్నారు. ఆయన విద్యామంత్రిగా ఉన్నప్పుడు జ్యోతిష్యం వంటి అంశాలను విద్యాంశాలలో భాగం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. నరేంద్ర మోడీ వినాయకుడిని ప్రస్తావిస్తూ వేల సంవత్సరాల క్రితమే భారత దేశంలో ప్లాస్టిక్ సర్జరీ ఉందని ప్రస్తావించారని దుడ్డు ప్రభాకర్ అన్నారు. డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి అధ్యక్షత వహించిన ఈ సదస్సులో ఏపీటీఎఫ్1938, ఏఐఎస్ఎఫ్, రెండు పీడీఎస్​యూ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖలో విద్యా సదస్సు

కేెంద్ర నూతన విద్యవిధానాన్ని మన పక్క రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలు దిల్లీ, పంజాబ్​లు అమలు చేయడం లేదు చరిత్ర వక్రీకరణ, పాఠాలు తొలగిస్తున్నారు. కేంద్రం విద్యా విధానం అమలు చేయనవసరం లేదు కానీ..కేంద్ర ప్రభుత్వం చెప్పకముందే ఏపీ సీఎం ఆగమేఘాల మీద మంచి చెడు పరిశీలించకుండా అమలు చేస్తున్నారు. దీన్ని మానుకొని రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా విద్యా విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. -రమేష్ పట్నాయక్, ఏపీ విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్

నూతన విద్యా విధానం ద్వారా శాస్త్రీయమైన పద్ధతులను మరుగు పడేసి, చరిత్రను వక్రీకరించి వేగంగా పలు మార్పులు చేస్తున్నారు.- దుడ్డు ప్రభాకర్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details