ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో భాజపాకు పూర్వ వైభవం రావాలి: సోము వీర్రాజు - భాజపా కార్పొరేటర్ల సన్మానం వార్తలు

విశాఖ తొలి మున్సిపల్ కార్పొరేషన్ మధుర స్మృతుల పేరిట... భాజపా నాటి కార్పొరేటర్లను సన్మానించింది. అటువంటి పూర్వ వైభవం భాజపాకు మళ్లీ రావాలి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు ఆకాంక్షించారు.

bjp meeting
భాజుపా కార్పొరేటర్ల సన్మానం

By

Published : Sep 8, 2020, 7:52 AM IST

2024లోనూ దేశంలో మళ్లీ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. 1981లో విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో భాజపా పార్టీ తరఫును గెలిచిన వారిని.. విశాఖ తొలి మున్సిపల్ కార్పొరేషన్ మధుర స్మృతుల పేరిట సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోము వీర్రాజు.. విశాఖలో భాజపాకు ఉన్న పూర్వ వైభవం తిరిగి రావాలని అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో భాజపా, జనసేన కలిసి మార్పులు తీసుకువస్తాయని తెలిపారు. నేటి రాజకీయాల్లో విలువులున్న నాయకులు కరవయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details