విశాఖ బీచ్ లోని నేవీ విజయ స్తూపం దగ్గర విశాఖ భాజపా నేతలు త్రివర్ణ పతాకాన్నిచేత పట్టి అమరవీరులకు నివాళి అర్పించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు కంభంపాటి హరిబాబు ఈ కార్యక్రమంలో పాల్గొని అమర సైనికులకు నివాళి అర్పించారు. చైనా కవ్వింపు చర్యలు శ్రుతి మించాయని, భారత సైనికుల మృతికి కారకులైన వారిని వదిలిపెట్టకూడదని అన్నారు. చైనా సైనికులను సమర్ధవంతంగా భారత సైన్యం ఎదుర్కొందని కొనియాడారు.
సైనికులకు నివాళులర్పించిన భాజపా - సైనికులకు నివాళులర్పించిన భాజపా
చైనా సైనిక దాడిలో అమరులైన కల్నల్ సంతోష్ బాబు ఇతర జవానుల మృతికి విశాఖలో భాజపా నేతలు నివాళి అర్పించారు. పార్టీలకు అతీతంగా నగర వాసులు వివిధ ప్రాంతాలలో అమరవీరులకు నివాళి అర్పించారు.
సైనికులకు నివాళులర్పించిన భాజపా