విశాఖ ఏజెన్సీ జి.మాడుగుల మండలం వాకపల్లిలో అసో అనే గిరి మహిళ పురిటి నొప్పులతో ఇంటి వద్దనే బాబుకు జన్మనిచ్చింది . మళ్లీ పురిటినొప్పులు రావటంతో పాడేరు ఆస్పత్రికి తరలించారు. అక్కడ మరో ఇద్దరు ఆడపిల్లలకు జన్మనిచ్చింది. పిల్లలు తక్కువ బరువుతో జన్మించటంతో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా మహిళకు ఇంతకు మునుపే...నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం వీరితో కలిపి సంతానం ఏడుకు పెరిగింది. ఏజెన్సీ ప్రాంతాల్లో కాన్పులపై అవగాహన లోపించటంతో పిల్లలు అనారోగ్యంతో జన్మిస్తుంటారని వైద్యులు తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో మునుపెన్నడూ...ముగ్గురు పిల్లులు ఒకే కాన్పులో జన్మించలేదని స్పష్టం చేశారు.
విశాఖ మన్యంలో.. ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం - Birth of three babies in a single unit in Visakha
సాధారణంగా ఒక కాన్పులో ఒకరు లేదా ఇద్దరు శిశువులు జన్మించటం చూస్తూ ఉంటాం. కానీ.. విశాఖ ఏజెన్సీలో ఓ గిరి మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన ఘటన జి.మాడుగుల మండలం వాకపల్లిలో చోటు చేసుకుంది. శిశువుల్లో ఇద్దరు ఆడపిల్లలు కాగా మరో బాబు ఉన్నాడు.

ఒకే కాన్పులో ముగ్గురు శిశువుల జననం
Last Updated : Jan 31, 2020, 11:27 PM IST