విశాఖ వేదికగా తొలిసారి ఓడరేవుల అంశంపై బిమ్స్‌టెక్ సదస్సు జరగనుంది. ఈనెల 7, 8 తేదీల్లో జరిగే సదస్సుకు నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, శ్రీలంక దేశాల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఇప్పటివరకు వివిధ అంశాలపై బిమ్స్‌టెక్ సదస్సులు వేర్వేరుచోట్ల జరిగాయి. తొలిసారి పోర్టులు-సముద్ర వాణిజ్య అంశాలపై ఈ సదస్సు నిర్వహిస్తున్నారని విశాఖ పోర్టు ట్రస్టు ఛైర్మన్ రామ్మోహన్‌రావు తెలిపారు. ఇందులో నౌకా వాణిజ్యానికి అవసరమైన పరస్పర సహకారం, అందుకు అనువైన పరిస్ధితులు, బంగాళాఖాతం తీరం వెంబడి ఉండే దేశాలు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.
విశాఖ వేదికగా.. 7, 8 తేదీలలో బిమ్స్ టెక్ సదస్సు - విశాఖలో బిమ్స్ టెక్ సదస్సు
విశాఖ వేదికగా అంతర్జాతీయ బిమ్స్ టెక్ సదస్సు జరగనుంది. ఈనెల7,8 తేదీలలో జరిగే సదస్సుకు ఏడు దేశాలనుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. నౌకా వాణిజ్యానికి అవసరమైన పరస్పర సహకారం, అందుకు అనువైన పరిస్ధితులు, బంగాళాఖాతం తీరం వెంబడి ఉండే దేశాలు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.
విశాఖ వేదికగా బిమ్స్‌టెక్ సదస్సు