ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖలో రెచ్చిపోయిన బైక్​ రేసర్లు​.. పలువురు అరెస్ట్​ - విశాఖలో బైక్ ర్యాలీతో బీభత్సం

Bus damage: విశాఖ నగరంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు బైక్ ర్యాలీతో బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసి, డ్రైవర్​పై దాడిచేసి గాయపరిచారు. రాత్రి 12 గంటల నుంచి 3గంటల వరకు కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ వీరంగం సృష్టించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

bike riders damage rtc bus and injured driver at vishakapatnam
బైక్ ర్యాలీతో యువకుల బీభత్సం.. అడ్డు వచ్చిన ఆర్టీసీ బస్సు ధ్వంసం

By

Published : Jul 11, 2022, 11:49 AM IST

Updated : Jul 11, 2022, 7:58 PM IST

Bike Riders attack on RTC Bus: విశాఖలో ఈనెల 9వ తేదీ అర్ధరాత్రి రోడ్లపై హల్​చల్​ చేసి పట్టుబడ్డ బైక్ రేసర్లపై కేసులు నమోదు చేసినట్లు ఈస్ట్ ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. స్వర్ణ భారతి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సును ఆపి అద్దాలకు ఉన్న వైఫర్లను విరగొట్టి బీభత్సానికి దిగారన్నారు. బస్సు డ్రైవర్​పై దాడి చేసిన హేమంత్ అనే యువకుడిపై.. త్రీటౌన్​లో కేసు నమోదు చేశామని అన్నారు. సీసీ టీవి ఫుటేజీ ఆధారంగా సుమారుగా 96 బైక్​ రైడర్స్​ను గుర్తించామని.. అందులో 40 మంది నిందితులను, 39 బైక్​లను అదుపులోకి తీసుకున్నామని వివరించారు. 13 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసి డిమాండ్​కు పంపించామని తెలిపారు.

విశాఖ నగరంలో అర్ధరాత్రి కొంతమంది యువకులు బైక్ ర్యాలీతో బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన ఆర్టీసీ బస్సును ధ్వంసం చేసి, డ్రైవర్​పై దాడిచేసి గాయపరిచారు. రాత్రి సుమారు 12 గంటల నుంచి వేకువజామున 3 గంటల వరకు.. కొంతమంది యువకులు ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ.. వీరంగం సృష్టించారు. ఆర్టీసీ కాంప్లెక్స్, స్వర్ణభారతి స్టేడియం కూడలి, బీచ్ రోడ్డులో బైక్ రైడ్ చేస్తూ.. హల్​చల్ చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్​లో అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సును అడ్డుకున్నారు. సైడ్ ఇవ్వాలని బస్సు డ్రైవర్ కోరడంతో.. రెచ్చిపోయిన యువకులు బస్సు ధ్వంసానికి పాల్పడ్డారు. వారించేందుకు వెళ్లిన డ్రైవర్​పై దాడి చేసి గాయపరిచారు.

ఇవీ చూడండి:

Last Updated : Jul 11, 2022, 7:58 PM IST

ABOUT THE AUTHOR

...view details