విశాఖలోని జి.మాడుగులలోని కోడాపల్లి వద్ద బైక్ అదుపుతప్పి 40 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో మణికంఠ అనే యువకుడు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ప్రమాదం హుకుంపేటలోని గన్నేరుపుట్టు వద్ద జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయలు కాగా, మరో వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. క్షతగాత్రులను కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వేర్వేరు చోట్ల బైక్ ప్రమాదాలు... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు - latest bike accident news
విశాఖ జిల్లాలోని మాడుగుల, హుకుంపేట మండలాల్లో ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో ఒకరు చనిపోగా... ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
విశాఖలో రెండు వేర్వేరు చోట్ల బైక్ ప్రమాదాలు... ఒకరిమృతి,ఇద్దరికి గాయాలు