విశాఖ కొబ్బరితోట ప్రాంతానికి చెందిన గుడివాడ ప్రవీణ్, అల్లిపురానికి చెందిన మోడి కార్తీక్ కొంతమంది స్నేహితులతో కలిసి ఆదివారం రుషికొండకు ద్విచక్ర వాహనాలపై బయల్దేరారు. వీరిద్దరు ఒక వాహనంపై ప్రయాణిస్తూ ముందుకు వెళ్లగా...మిగతా స్నేహితులు వీరిని అనుసరించారు.
శిరస్త్రాణం లేని సరదా ప్రయాణం... తీసింది ఇద్దరి ప్రాణం...
అతి వేగం ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. సరదా కోసం చేసిన విహారయాత్ర విషాద యాత్రగా ముగిసింది. రెండు కుటుంబాల్లో అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. విశాఖ బీచ్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.
అతివేగానికి రెండు ప్రాణాలు బలి !
ప్రవీణ్, కార్తీక్ బైక్ వేగంగా నడపటంతో బీచ్‌రోడ్డు బేపార్క్ వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టంది. ఆ వేగానికి వాహనం వైనుక టైరు ఊడిపోయి...ఇద్దరు గాల్లో ఎగిరిపడ్డారు. శిరస్రాణం లేకుండా బండి నడపటంతో తలకు బలమైన గాయలై...ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే ద్విచక్రవాహనం వేగం గంటకు 100 కి.మీ పైనే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.