ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెళ్లైన నెల రోజులకే భర్త మరణం.. శోకసంద్రంలో భార్య - మునగపాక రోడ్డు ప్రమాదం

ఎన్నో కలలతో కళ్యాణ ఘట్టాన్ని ముగించుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు ఆ దంపతులు. వేదపండితుల సాక్షిగా ఎన్నో బాసలు, మరెన్నో ఊసులతో... భవిష్యత్తు వైపు అడుగులు వేయటం ఆరంభించారు. కానీ అన్యోన్యంగా ఉన్న ఆ జంటను చూసి విధికి కూడా కళ్లు కుట్టాయేమో... మాసం రోజులైనా గడవకుండానే మృత్యువాత పడ్డాడు భర్త. ఆ నూతన వధువు రోదన మిన్నంటింది.

bike accident
పెళ్లయిన నెల రోజులకే భర్త మరణం

By

Published : Jan 12, 2021, 12:46 PM IST

Updated : Jan 12, 2021, 2:18 PM IST

ద్విచక్ర వాహనాన్ని వ్యాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​ నడుపుతున్న వ్యక్తి కింద పడిపోయాడు. అటుగా వస్తున్న లారీ ఆయనపై నుంచి వెళ్లిపోయింది. అంతే అతను అక్కడికక్కడే మృతి చెందాడు. విశాఖ జిల్లా మునగపాక మండలం గంగాదేవిపేటలో జరిగిన ఈ ప్రమాదం ఓ కొత్త జంటను విడదీసింది. వారి కలను చెరిపేసింది.

అనకాపల్లి గాంధీ నగర్​కు చెందిన కౌండిన్య.. అచ్యుతాపురంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజారిగా పని చేస్తున్నారు. ఆయనకు నెల క్రితం వివాహమైంది. రోజూ మాదిరిగానే అచ్యుతాపురంలో ఆలయం పని పూర్తి చేసుకొని తిరిగి వస్తుండగా ఘోరం జరిగిపోయింది. బైకు వస్తున్న అతన్ని వెనకవైపు వేగంగా దూసుకొచ్చిన వ్యాను ఢీ కొట్టగా.. కౌండిన్య అక్కడికక్కడే చనిపోయాడు.

వివాహమైన నెల రోజుల్లోనే భర్త రోడ్డు ప్రమాదానికి బలవ్వడంతో లావణ్య ఒక్కసారిగా హతాశురాలైంది. ఆమె రోదనలు చూసిన వాళ్ల కళ్లల్లోనూ నీళ్లు తిరిగాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ప్రియుడిని కత్తితో పొడిచి చంపేసిన ప్రియురాలు

Last Updated : Jan 12, 2021, 2:18 PM IST

ABOUT THE AUTHOR

...view details