భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ పాడేరులో ప్రయాణిస్తున్న వాహనాలపై భారీ వృక్షం నేలకొరిగింది. ప్రధాన రహదారిపై ఈ ఘటన జరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఏజెన్సీని తిలకించేందుకు వచ్చిన పర్యాటకుల కారు, ఆటో, రేకుల షెడ్డు ధ్వంసం అయ్యాయి. పాడేరు ప్రధాన కూడలి పాత బస్టాండ్ ఆర్ అండ్ బి కార్యాలయం ఎదుట.. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం కావడం ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కారు ముందు భాగంపై చెట్టు పడటం.. తృటిలో ప్రమాదం తప్పించుకున్నామని ప్రయాణికులు వాపోతున్నారు.
పాడేరులో నేలకొరిగిన భారీ వృక్షం.. కారు, ఆటో ధ్వంసం - big tree collapsed on the road latest news
భారీ వర్షాలకు విశాఖ ఏజెన్సీ పాడేరులో ప్రధాన కూడలి పాత బస్టాండ్ ఆర్అండ్బి కార్యాలయం ఎదుట భారీ వృక్షం నేలకొరిగింది. ఈ ప్రమాదంలో కారు, ఆటో, పక్కనే ఉన్న రేకుల షెడ్డు ధ్వంసం అయ్యాయి.
![పాడేరులో నేలకొరిగిన భారీ వృక్షం.. కారు, ఆటో ధ్వంసం big tree collapsed on the road](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8879488-104-8879488-1600675966868.jpg)
నేలకొరిగిన భారీ వృక్షం