పెద్ద పరిమాణంలో ఉన్న ముల్లంగి దుంపలను విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ పంచాయతీ.. గొల్లలపాలానికి చెందిన యువ రైతు బొట్ట పాలవెల్లి పండించాడు. యువ రైతు బొట్ట పాలవెల్లికి వ్యవసాయం అంటే చాలా మక్కువ. తన పొలంలో అందరిలానే.. ముల్లంగి పంట సాగుచేశాడు. అయితే ప్రత్యేక సంరక్షణ చర్యలు చేపట్టి.. సాగు చేయడంతో మంచి దిగుబడులు వచ్చాయి. సాధారణంగా ముల్లంగి దుంప 100 గ్రాములు నుంచి పావుకేజీ వరకు బరువు ఉంటాయి. యువ రైతు పాలవెల్లి పండించిన ముల్లంగి మాత్రం ఒక కేజీ నుంచి రెండు కేజీల బరువున్న దుంపలు దిగుబడికి వచ్చాయి.
ఎంతపెద్ద ముల్లంగి దుంపలో..! - విశాఖలో భారీ ముల్లంగి దుంప న్యూస్
సాధారణంగా ముల్లంగి దుంప 100 నుంచి 200 గ్రాములు.. పావుకేజీ బరువు వరకు పెరుగుతాయి. అయితే ఈ యువ రైతు పండించిన ముల్లంగి దుంపలు మాత్రం కేజీన్నర.. రెండు కేజీల బరువున్నవి దిగుబడికి వచ్చాయి. ఇంతకీ ఇవి ఎక్కడో తెలుసా?
.
కష్టానికి తగిన ప్రతిఫలంగా.. ముల్లంగి పంట రెండింతలు దిగుబడికి రావడం చాలా ఆనందంగా ఉందని రైతు అంటున్నారు. యువ రైతు పాలవెల్లి పండించిన ముల్లంగి దుంపలను గ్రామానికి చెందిన తోటి రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.
Last Updated : Jan 27, 2021, 5:22 PM IST