ప్రాణాలకు తెగించి వైద్యులు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. వారి సేవలకు గుర్తుగా విశాఖ నగరంలోని స్వాతి ప్రమోటర్స్ సంస్థ 14 అడుగుల డాక్టర్ ప్రతిమను రూ.2.50లక్షల వ్యయంతో తయారు చేయించింది. స్థానిక కళాకారులు జీ.వీ.రమణమూర్తి బృందం ప్రతిమను తీర్చిదిద్దారు. దీనిని నగరంలో ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ బాధ్యులు జీ.వీ.కృష్ణారెడ్డి తెలిపారు.
వైద్యుల సేవకు 'కళా'వందనం - విశాఖలో స్వాతి ప్రమోటర్స్ సంస్థ
కరోనా కట్టడిలో కీలక పాత్ర పోషిస్తున్న వైద్యుల గురించి ఎంతా చెప్పినా తక్కువే. క్లిష్ట పరిస్థితులలో రోగులకు చేసే సేవలు అమోఘం. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అవుతుంది. వారి సేవలకు గుర్తుగా విశాఖ నగరంలో స్వాతి ప్రమోటర్స్ సంస్థ డాక్టర్ విగ్రహాన్ని తయారు చేయిస్తోంది.
విశాఖలో డాక్టర్ విగ్రహాం తయారీ