విశాఖలోని శ్రీ భావన విద్యానికేతన్‌లో ఇన్స్పైర్ టెక్ కార్యక్రమం Inspire Tech : ప్రతి మతం అచరిస్తున్న విధానాలలో వెనక సైన్స్ దాగి ఉందని విశాఖలోని ఓ విద్యా సంస్థ విద్యార్థులు అంటున్నారు. దేవాలయానికి వెళ్లిన సమయంలో గుడిలో కొట్టే గంట నుంచి దర్శనం ముగిసిన తర్వాత తీసుకునే తీర్థం వరకు.. ప్రతి దానిలో సైన్స్ ఉందని వారు వివరిస్తున్నారు. ఆలయాలు, పరిశోధన సంస్థల నమూనాలను తయారు చేసిన విద్యార్థులు తోటి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉన్నత విద్యలో సహాయపడతాయని విద్యాసంస్థ యాజమాన్యం వివరించింది.
విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి సంస్కృతి, సంప్రదాయాల వెనుక సైన్స్ దాగి ఉన్న.. వాస్తవాలను వెలికితీసి విద్యార్థులకు పరిచయం చేయటానికి విశాఖలోని శ్రీ భావన విద్యానికేతన్ అనే విద్యా సంస్థ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఇన్స్పైర్ టెక్ పేరుతో నిర్వహించి ఈ ప్రత్యేక కార్యక్రమంలో.. విద్యార్థులకు మతాలలో అచరిస్తున్న పద్ధతులలో, ధర్మాలలో ఉన్న సైన్స్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ఆలయ నమూనా అందరినీ ఆకర్షించింది. దీని ద్వారా విద్యార్థులు.. ఆలయాల్లో అచరిస్తున్న ధర్మాలను తోటి విద్యార్థులకు తెలిపారు. ఆలయంలో ప్రదక్షిణ, తీర్ధం తీసుకోవటం, గుడిలో ఏర్పాటు చేసే ధ్వజ స్తంభం వంటి వాటిలో ఉన్న సైన్స్‌ను వివరించారు. ఇదే కాకుండా పీఎస్ఎల్వీ రాకెట్ లాంటి నమూనాలను సైతం రూపొందించారు. అంతరిక్ష పరిశోధన సంస్థల సేవలను, వాటి గొప్పతనాన్ని విద్యార్థులు తెలిపారు. గృహ విజ్ఞానం, అంతరిక్ష, రసాయన శాస్త్రాలకు సంబంధించిన ఆంశాలపై ఇన్స్పైర్ టెక్‌లో అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో దాదాపు 200 మంది విద్యార్థుల వరకు పాల్గొన్నారు. అనేక విషయాలను అర్థం చేసుకోవటానికి ఉపాధ్యాయులు సహాయం చేశారని విద్యార్థులు తెలిపారు. తెలియని ప్రతి ఆంశాన్ని వివరించి చెప్పారని.. ఆలయ, రాకెట్ నమూనాల కోసం మాకు కావాల్సిన ప్రతిది మాకు అందించి ప్రోత్సాహించారని పేర్కొన్నారు. వివిధ మతాలలో ఉన్న సంప్రాదాయాల వెనక సైన్స్ దాగి ఉంటుందని విద్యార్థులు అన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, నైపుణ్యం వెలికి తీసేందుకు ఇన్స్పైర్ టెక్ ఏర్పాటు చేసినట్లు విద్యాసంస్థ యాజమాన్యం తెలిపింది. యూకేజీ నుంచి పదో తరగతి విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారని అన్నారు. ఒకటో తరగతి లోపు పిల్లలను వివిధ వేషధారణలతో అలకరించినట్లు వివరించారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు.
ఇవీ చదవండి :